News November 7, 2024
ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చ
AP: ఎస్సీ వర్గీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించారు. దళితుల్లోని ఉపకులాలన్నింటికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే వర్గీకరణ అమలు చేశామని, న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు.
Similar News
News November 8, 2024
విలేజ్ డిఫెన్స్ గార్డులను హతమార్చిన ఉగ్రవాదులు
J&K కిష్త్వార్లోని ఓహ్లీ కుంట్వారాకు చెందిన ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను (VDG) జైష్-ఏ-మహ్మద్కు చెందిన కశ్మీర్ టైగర్స్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన కశ్మీర్ టైగర్స్ VDG క్రియాశీలక సభ్యులు కుల్దీప్ కుమార్, నజీర్ అహ్మద్ గురువారం ఉదయం ఆక్రమిత కశ్మీర్లోని అటవీ ప్రాంతంలో ఇస్లాం ముజాహిదీన్లను వెంబడిస్తూ వచ్చినట్టు తెలిపింది. దీంతో కాల్చిచంపినట్టు ప్రకటించింది.
News November 8, 2024
నిరుపేదల సేవలో సచిన్ భార్య, కుమార్తె
సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా రాజస్థాన్లో నిరుపేదలతో సమయాన్ని గడిపారు. పోషణ అందని చిన్నారులకు ఆహారాన్ని అందించడంతో పాటు కలిసి ఆడుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో సారా వెల్లడించారు. అన్ని కష్టాల్లోనూ అక్కడి మహిళలు చూపిస్తున్న సంకల్ప బలం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె వెల్లడించారు.
News November 8, 2024
CM పుట్టినరోజు.. ప్రజలంతా పూజలు చేయాలని కోరిన మంత్రి
TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, మెస్ ఛార్జీలు పెంచిన సందర్భంగా హాస్టళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సెలబ్రేషన్స్ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డిని ఆశీర్వదించేలా ప్రజలంతా పూజలు చేయాలని కోరారు. రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.