News July 10, 2024
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఫోకస్!

AP: రాష్ట్ర ఆర్థిక శాఖపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పెండింగ్ బిల్లులు, శాఖల వారీగా వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై సీఎం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమికంగా రూ.14 లక్షల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఈసారి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించినట్లు సమాచారం.
Similar News
News November 25, 2025
వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

మధ్యప్రదేశ్లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
ఉద్యాన పంటలతోనే సీమ అభివృద్ధి: పయ్యావుల

AP: రాయలసీమలో రైతుల ఆదాయం పెరగాలంటే అది ఉద్యాన పంటలతోనే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. సీమలో సంపద సృష్టి, సిరి సంపదల వృద్ధి ఉద్యాన పంటలతో సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ హార్టికల్చర్పై దృష్టి పెట్టాలన్నారు.
News November 25, 2025
ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.


