News September 8, 2025

అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

image

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.

Similar News

News September 8, 2025

రూ.94వేల కోట్లలో రూ.250 కోట్లు నష్టం: కేటీఆర్

image

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని KTR విమర్శించారు. ‘మేడిగడ్డను రెండేళ్లుగా పక్కనబెట్టారు. కాళేశ్వరం కోసం రూ.94వేల కోట్లు ఖర్చు అయితే మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగి రూ.250 కోట్ల నష్టం జరిగింది. దాన్ని మేమే రిపేర్ చేస్తామని ఏజెన్సీ ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదు’ అని ఫైరయ్యారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లిస్తున్నారని తెలిపారు.

News September 8, 2025

ALERT: అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ మొబైల్ కొంటున్నారా?

image

ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మొబైల్స్, యాక్సెసరీస్, ట్యాబ్స్ కొనుగోలు చేసేవారికి ‘శామ్‌సంగ్’ పలు సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో రీఫర్బిష్డ్, ఫేక్ వస్తువులు కొనకుండా యూజర్లను అలర్ట్ చేసింది. అమెజాన్‌లో Clicktech Retail, STPL Exclusive, Darshital Etel సెల్లర్స్ నుంచి మాత్రమే కొనాలంది. ఫ్లిప్‌కార్ట్‌లో TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerceలో తీసుకోవాలంది.

News September 8, 2025

BREAKING: ఈనెల 21 నుంచి దసరా సెలవులు

image

తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలిడేస్ అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయని అందులో పేర్కొంది. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది. అటు జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.