News September 13, 2024

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్‌, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.

Similar News

News December 9, 2025

ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా పంచాయతీ పోరు!

image

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంతగా ఈసారి సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. BRS, INC, BJP అభ్యర్థులకు దీటుగా రెబల్స్ బరిలోకి దిగడంతో గ్రామాల్లో ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇవి ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని ఓటర్లు అంటున్నారు. ఎల్లుండే తొలి విడత పోలింగ్ జరగనుండటంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్ పోటీదారులు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు.

News December 9, 2025

తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

image

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 9, 2025

తప్పిపోయిన అవ్వను గుర్తించిన మనమడు.. ఎలాగంటే?

image

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలు(ముంబై) ఇంటి నుంచి బయటకెళ్లి తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా ఆమె మనమడు మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. వృద్ధురాలు తాజుద్దీన్ ధరించిన నక్లెస్‌లో ఉన్న GPSతో ఆమె ఉన్న చోటును ట్రాక్ చేశాడు. బైక్ ఢీకొట్టడం వల్ల ఆస్పత్రిపాలైనట్లు తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలా సాంకేతికత ఆమెను తిరిగి కుటుంబానికి దగ్గర చేసింది.