News October 11, 2024
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు

TG: దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు.
Similar News
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.
News January 12, 2026
గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

గోవా షిప్యార్డ్ లిమిటెడ్(<
News January 12, 2026
తండ్రి బతికుండగా కొడుకు చేయకూడని పనులు

పితృకార్యాలు, తర్పణాలు, పిండప్రదానం వంటి కార్యక్రమాలను చేయకూడదు. దానధర్మాలు చేసేటప్పుడు తండ్రి పేరు మీదుగా చేయడం ఉత్తమం. తండ్రి బతికి ఉండగా మీసాలు పూర్తిగా తొలగించడం, శుభకార్యాల ఆహ్వాన పత్రికల్లో తండ్రి పేరును కాదని కొడుకు పేరును ముందుగా వేయడం సంప్రదాయ విరుద్ధంగా పరిగణిస్తారు. తండ్రిని కుటుంబ యజమానిగా గౌరవిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడవడం వల్ల కుటుంబంలో సామరస్యం నెలకొంటుందని మన పెద్దలు చెబుతారు.


