News February 1, 2025

పద్మ అవార్డులపై సీఎం కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణ నుంచి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ఐదుగురి(గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు) పేర్లు తాను సిఫార్సు చేసినట్లు CM రేవంత్ తెలిపారు. వాళ్లు తమ పార్టీ వారు కాకపోయినా, సిద్ధాంతపర విభేదాలున్నా ప్రజల్లో ఉండబట్టే పేర్లు పంపామన్నారు. పక్క రాష్ట్రం APకి ఐదు అవార్డులు ఇచ్చారని, వాళ్లకంటే మేం ప్రతిపాదించిన వాళ్లు తక్కువా? అని గద్దర్ జయంతి సభలో CM ప్రశ్నించారు.

Similar News

News November 7, 2025

ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

image

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.

News November 7, 2025

USలో అనుమానిత పౌడర్‌తో సైనికుల అస్వస్థత

image

అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్‌బేస్‌లో కెమికల్ పౌడర్‌తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్‌కు గురువారం వచ్చిన పార్శిల్‌ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్లాక్‌ను సీల్ చేసి, సమీప భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది.

News November 7, 2025

ఢిల్లీలో 100కి పైగా విమానాల రాకపోకలకు ఆటంకం

image

ఢిల్లీలో 100కి పైగా విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. IGIA ఎయిర్‌పోర్ట్ ATCలో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి కారణం. దీని వల్ల ఆన్‌బోర్డు, టెర్మినల్స్ వద్ద ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వచ్చింది. అత్యధిక విమానాల రాకపోకల్లో ఆలస్యం చర్చకు దారితీసింది. సమస్యను గుర్తించి పరిష్కరించామని, పరిస్థితి క్రమేణా సద్దుమణిగినట్లు ఎయిర్‌పోర్టు తెలిపింది. ఉత్తరాది ఎయిర్‌పోర్టులపైనా దీని ప్రభావం పడింది.