News April 13, 2025
ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 13, 2025
డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్ కార్పొరేషన్

AP: రాష్ట్రాన్ని డ్రోన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రజలు, పాలనకు ఉపయోగపడేలా డ్రోన్ సేవలు విస్తృతం చేస్తాం. ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 21లోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి కొత్త యూజ్ కేసెస్ను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొంది.
News April 13, 2025
చికెన్ ఎక్కువగా తింటే?

కొందరికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. రోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ఎక్కువ మోతాదులో తింటే బీపీ, గుండె జబ్బులు వస్తాయి. కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. రక్తంలో టాక్సిన్లు నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి చేతి, కాలి వేళ్లలో స్ఫటికాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి ఒకటి రెండు సార్లు తినడం ఉత్తమం.
News April 13, 2025
తాజా సినిమా ముచ్చట్లు

☛ మే 23న ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ సినిమా రీ రిలీజ్
☛ రేపు HYDలోని పార్క్ హయత్లో తమన్నా నటించిన ‘ఓదెల-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
☛ రూ.100 కోట్ల మార్కును దాటిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కలెక్షన్స్
☛ మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్గా దేవకట్టా?
☛ మూడు రోజుల్లో రూ.32.2 కోట్ల వసూళ్లు రాబట్టిన గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ సినిమా ‘జాట్’