News April 11, 2024

ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులకు నష్టాన్ని కలిగిస్తే సహించేది లేదన్నారు. జనగామ మార్కెట్ యార్డ్ ఘటనలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ తీరును అభినందించారు. రైతులను మోసం చేసిన ట్రేడర్లపై కేసులు పెట్టడంతో పాటు మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయడాన్ని ప్రశంసించారు.

Similar News

News November 15, 2024

IPL: సెట్-1 ప్లేయర్లు వీరే

image

ఈ నెల 24న మధ్యాహ్నం ఒంటి గంటకు ఐపీఎల్-2025 మెగా వేలం ప్రారంభం కానుంది. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వేలానికి రానున్నారు. సెట్-2లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వస్తారు. సెట్‌-3లో బ్రూక్, కాన్వే, మెక్‌గుర్క్, త్రిపాఠి, వార్నర్, పడిక్కల్, మార్క్రమ్ వస్తారు.

News November 15, 2024

ప్రమాదంలో 80శాతానికి పైగా భారతీయుల ఆరోగ్యం: శాస్త్రవేత్త

image

పర్యావరణ మార్పు, కాలుష్యం కారణంగా భారత్‌లో 80శాతంమంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి సంబంధిత సమస్యల నుంచి మాతృత్వ సమస్యల వరకూ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం ప్రభుత్వాల ప్రాధాన్యం కావాలి’ అని స్పష్టం చేశారు.

News November 15, 2024

తుఫాను వెళ్లే దారేది.. పసిగడుతున్న AI

image

వాతావ‌ర‌ణ పరిస్థితులపై ఇటీవ‌ల‌ సంప్రదాయ అంచనా విధానాలతో పోలిస్తే AI ఇస్తున్న కచ్చితమైన అంచ‌నాలు నిపుణుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. జులైలో బెరిల్ హరికేన్ ద‌క్షిణ మెక్సికో నుంచి ద‌క్షిణ టెక్సాస్‌ వైపు పయనిస్తుందని ఇతర విధానాల కంటే Google DeepMind’s GraphCast వారం ముందే ప‌సిగ‌ట్ట‌డం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. అయితే వీటికి ఫిజిక్స్ తెలియదని, సంప్రదాయ విధానాలతోపాటు వీటిని వాడుకోవచ్చంటున్నారు.