News November 11, 2024

ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ‘ఎస్మా’ ప్రయోగించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే కేసులు పెట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News December 10, 2025

టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

image

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 10, 2025

NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

<>NTPC<<>> 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్( ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News December 10, 2025

కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

image

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.