News February 4, 2025
పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

AP: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు వస్తుండటంతో ఆయన స్పందించారు. అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని, ఉ.7 నుంచి సా.6 లోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో పెన్షన్ ఇస్తున్నట్లు తేలితే కారణాలు తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
Similar News
News October 16, 2025
50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించరాదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లుండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50%లోనే సీట్లు కేటాయించాలి. ప్రస్తుతమున్న12769 పంచాయతీల్లో 6384, MPTC 5745లో 2872, MPP 566లో 283, ZPP 32లో 16 రిజర్వేషన్ల కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లలోనే SC, ST, BCలకు సీట్లు రిజర్వు చేయాలి. దీనికి మించి ఉండాలంటే పార్టీ పరంగా ఇవ్వాలి.
News October 16, 2025
రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: మోదీ

AP: డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కాదని, ఇప్పుడు ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా ఉందని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని కర్నూలు సభలో పేర్కొన్నారు.
News October 16, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 7 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iict.res.in/