News August 12, 2025
స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

TG: అల్పపీడనంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు <<17383239>>రద్దు<<>> చేయాలని CM ఇప్పటికే ఆదేశించారు.
Similar News
News August 12, 2025
రేపటి నుంచి జాగ్రత్త

APలో రేపటి నుంచి 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు ప.గో, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, ఎల్లుండి కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండవద్దని సూచించారు.
News August 12, 2025
మందుబాబులకు శుభవార్త

AP ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు అందించింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ రూల్-2024కు సవరణ చేసింది. పర్మిట్ రూమ్‌లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 2.77 లక్షల మంది పట్టుబడినట్లు పేర్కొంది. పొలాలు, పార్కులు, రోడ్ల పక్కన మద్యం సేవించడాన్ని తగ్గించేలా లైసెన్స్‌తో కూడిన పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతించినట్లు వెల్లడించింది.
News August 12, 2025
‘వార్ 2’కు టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ AP ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్లుండి రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు రూ.500 టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు ఈనెల 23 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు.