News February 25, 2025

మెగా డీఎస్సీ, ‘సుఖీభవ’పై సీఎం కీలక ప్రకటన

image

AP: మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి, వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగులు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను(రైతుకు ₹20K) 3 విడతల్లో అందిస్తాం’ అని వెల్లడించారు.

Similar News

News November 22, 2025

కార్ల వేలానికి ఓకే.. నీరవ్ ‌మోదీకి సీబీఐ కోర్టు షాక్

image

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్‌రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్‌ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.

News November 22, 2025

మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

image

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.

News November 22, 2025

కోర్టులో రహస్య చిత్రీకరణపై చర్యలు తీసుకోవాలి: YCP మాజీ MLA

image

AP: CBI కోర్టు జడ్జి ముందు YS జగన్ నిలబడి ఉండగా రహస్యంగా వీడియో చిత్రీకరించి కుట్రతో వైరల్ చేస్తున్నారని YCP మాజీ MLA సుధాకర్‌బాబు విమర్శించారు. దీనిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ ఎక్కడికెళ్లినా వేలాది మంది వస్తుండడంతో అక్కసుతో ఇలా వ్యక్తిత్వ హననానికి దిగజారారని మండిపడ్డారు. CBN జైల్లో ఉండగా ఫొటోల వంటివీ బయటకు రాకుండా నాటి జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని కాపాడిందన్నారు.