News June 20, 2024
CS పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి సీఎం లేఖ
AP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. నీరభ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగించాలని సీఎం కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తొలుత 3 నెలల పాటు సర్వీస్ పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 3, 2025
సంజూకు గాయం.. 6 వారాలు ఆటకు దూరం!
ఇంగ్లండ్‌తో 5వ టీ20లో ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలికి తగిలి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో అతను వికెట్ కీపింగ్‌కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని 4-6 వారాల పాటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే IPL ఆడొచ్చని పేర్కొన్నాయి. సంజూ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.
News February 3, 2025
ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా?: MLC కవిత
BCల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని, గతంతో పోల్చితే వారి జనాభా ఎలా తగ్గుతుందని MLC కవిత విమర్శించారు. ‘TGలో ఏ లెక్కన చూసినా 50-52% BCలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరం. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల BC జనాభా తేడా కనిపిస్తోంది. OCల జనాభా ఎక్కువ కనిపిస్తోంది. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీల, SC, ST జనాభా తగ్గుతుందా?’ అని ప్రశ్నించారు.
News February 3, 2025
డబ్బుల్లేక సన్యాసం తీసుకున్నా: మాజీ హీరోయిన్
ఆర్థిక కష్టాలతో తాను సన్యాసం తీసుకున్నానని మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి అన్నారు. ‘కిన్నెర అఖాడా మహామండలేశ్వర్ కోసం నేను రూ.కోట్లు ఇచ్చానంటున్నారు. నా వద్ద రూ.10cr కాదు కదా రూ.కోటి కూడా లేదు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలు సీజ్ చేసింది. చేతిలో రూపాయి లేకుండా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈమెను మహామండలేశ్వర్‌గా నియమించి వెంటనే బహిష్కరించిన విషయం తెలిసిందే.