News October 10, 2024

టాటా మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

image

చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రపంచంపై ముద్ర వేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్‌ను కోల్పోయిందని, ఆయనలాగా ఇంకెవ్వరూ ఉండరని టీజీ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. వాణిజ్య రంగానికి రతన్ టాటా ఆదర్శమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.

Similar News

News December 1, 2025

కిచెన్ టిప్స్.. మీ కోసం..

image

* సొరకాయ మిగిలిపోయినపుడు కుళ్లిపోకుండా ఉండాలంటే.. ఆ వైపును అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టాలి.
* గాజు గ్లాసులను తరలించేటప్పుడు వాటికి కాటన్ క్లాత్/ సాక్స్‌లు తొడిగితే ఒకదానికొకటి తగిలినా పగలవు.
* కేక్ మిశ్రమంలో టీ స్పూన్ గ్లిజరిన్ కలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* వాటర్ బాటిల్‌ను వాడకుండా ఉంచితే దుర్వాసన వస్తుంది. ఇలా జరగకూడదంటే అందులో యాలకులు/లవంగాలు/ దాల్చిన చెక్క ముక్క వేసి ఉంచండి.

News December 1, 2025

రష్యాపై ఆంక్షలు.. 17,700 KMs నుంచి ఇండియాకు ఆయిల్

image

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దేశం గయానా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దాదాపు 17,700 కిలోమీటర్ల దూరం నుంచి ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. 2 సూపర్ ట్యాంకర్లు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాయి. ఒక్కో దాంట్లో 2 మిలియన్ బ్యారెల్స్ చొప్పున ఆయిల్ వస్తోంది. జనవరి నాటికి అవి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.

News December 1, 2025

ఈ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు 90% చెక్..!

image

మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPV టీకా తీసుకున్న బాలికల్లో, టీకా తీసుకోని వారితో పోలిస్తే, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% నుంచి 90% వరకు గణనీయంగా తగ్గినట్లు తాజా డేటా స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 15-20 సంవత్సరాల పాటు రక్షణ ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.