News January 8, 2025
సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000: KTR

TG: నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెట్టారని వచ్చిన ఆరోపణలపై KTR స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన. శభాష్ ఇందిరమ్మ రాజ్యం’ అని ట్వీట్ చేశారు. కాగా అల్పాహారంలో విద్యార్థినులకు గొడ్డు కారం పెట్టారని పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Similar News
News November 15, 2025
HYD: BRSకు BYE.. BYE: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ BRS టార్గెట్గా ట్వీట్ చేసింది. ‘మొన్న గ్రామాలు.. నేడు HYD సిటీ BRSకు బై.. బై చెప్పాయి.. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవుతుంది’ అంటూ పేర్కొంది. కాగా HYD ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.


