News July 26, 2024

పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం సమీక్ష

image

TG: పంచాయతీ ఎన్నికలపై మంత్రి సీతక్క, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. కులగణన జరిగితేనే రిజర్వేషన్ల పెంపు చేయాలన్న సుప్రీం ఆదేశాలతో సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు గ్రామపంచాయతీల టర్మ్ ముగిసి ఆరు నెలలు కావొస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Similar News

News April 10, 2026

కడప: యువతి గొంతు కోసి హత్య

image

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

News April 10, 2026

ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.

News April 10, 2026

ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

image

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.