News October 27, 2025

జూబ్లీహిల్స్ ప్రచారానికి CM.. షెడ్యూల్ ఇదే

image

TG: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజీగూడ, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడ, 8, 9న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో రాత్రి 7 గంటల నుంచి ప్రచారం చేయనున్నారు.

Similar News

News October 27, 2025

క్షిపణి పరీక్షలు కాదు.. ముందు యుద్ధం ఆపండి: ట్రంప్

image

రష్యా <<18109096>>Burevestnik<<>> న్యూక్లియర్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షపై US ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ‘కొత్త న్యూక్లియర్ వెపన్స్‌ను పరీక్షించడంపై కాకుండా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడంపై మీరు దృష్టి పెట్టండి’ అని సలహా ఇచ్చారు. ఇది ఎలాంటి రక్షణ వలయాన్నైనా ఛేదించుకొని పోగలదని, ప్రపంచంలో ఇలాంటి క్షిపణి వ్యవస్థ మరెవ్వరి దగ్గరా లేదని రష్యా ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News October 27, 2025

ఘోరం.. నెయ్యి పోసి, సిలిండర్ పేల్చి చంపేసింది

image

ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సహజీవనం చేస్తున్న రామ్‌కేశ్(32) తన ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని అమృత(21) బ్రేకప్ చెప్పింది. ఈనెల 6న Ex బాయ్‌ఫ్రెండ్‌ సుమిత్‌తో కలిసి రామ్‌కేశ్ గొంతు కోసి చంపింది. బాడీపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి సిలిండర్‌‌ను పేల్చింది. ఫోరెన్సిక్ చదువు, క్రైమ్ సిరీస్‌ల తెలివితో అమృత మేనేజ్ చేసినా CCఫుటేజీ, ఫోన్ లొకేషన్‌తో దొరికిపోయింది.

News October 27, 2025

ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

image

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.