News January 21, 2025
దావోస్‌లో రెండో రోజు సీఎం షెడ్యూల్

AP: దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో భేటీ కానున్నారు. 15కు పైగా సమావేశాల్లో ముఖాముఖి భేటీల అనంతరం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, పెట్రో కెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సదస్సులో పాల్గొంటారు. టాటా, కార్ల్స్ బెర్గ్, LG, సిస్కో, వాల్‌మార్ట్, కాగ్నిజెంట్ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చిస్తారు.
Similar News
News December 8, 2025
CBSE తరహాలో టెన్త్ ఎగ్జామ్స్?.. షెడ్యూల్‌పై ఉత్కంఠ

TG: CBSE తరహాలో పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి SSC పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు 2, 3 రోజులు గ్యాప్ ఉంచి 2 రకాల షెడ్యూళ్లను CMOకు పంపారు. మధ్యలో రంజాన్, ఉగాది, మహవీర్ జయంతి, శ్రీరామ నవమి ఉండడంతో 4 రోజుల వ్యవధీ ఉండనుంది. ఈ ప్రతిపాదనలపై CM నిర్ణయం తీసుకోకపోవడంతో పరీక్ష తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ షెడ్యూల్ వెలువడిన వారంలోగా టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రావాల్సి ఉండగా నెలరోజులవుతున్నా తేలలేదు.
News December 8, 2025
ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి: ప్రియాంకా గాంధీ

ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే వందేమాతరంపై చర్చ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ‘వందేమాతరం కేవలం గేయం కాదు అది ప్రజల గొంతుక. ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి. వేల మంది మరణిస్తున్నారు. త్వరలో బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై చర్చను వదిలేసి ఈ సమయంలో జాతీయ గేయంపై చర్చ అవసరమా?’ అని లోక్‌సభలో ప్రియాంక పేర్కొన్నారు.
News December 8, 2025
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్

ఈ-కామర్స్, SMలో తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సదరు SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా SMలో ట్రోలింగ్‌పై గతంలో నాగార్జున కూడా ఢిల్లీ HCని ఆశ్రయించారు.


