News July 11, 2024

నేడు 3 జిల్లాల్లో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం పదింటికి వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. వైజాగ్‌లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.

Similar News

News December 27, 2025

MSMEలకు పెరుగుతున్న రుణ వితరణ

image

దేశంలోని MSMEలకు బ్యాంకులు, NBFCలు తదితరాల నుంచి రుణ వితరణ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి 16% పెరిగి రూ.46లక్షల కోట్లకు చేరింది. యాక్టివ్ లోన్ ఖాతాలూ 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరాయి. కేంద్ర రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు దీనికి కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లలో MSME రుణ చెల్లింపుల్లో కూడా వృద్ధి కనిపించింది. 91-180 రోజుల ఓవర్ డ్యూ అయిన లోన్‌లు 1.7% నుంచి 1.4%కి తగ్గాయి.

News December 27, 2025

శనివారం రోజు చేయకూడని పనులివే..

image

శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం, ఉప్పు, నూనె, ఇనుము, నల్ల మినపప్పు వంటి వస్తువులను కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ పేదలను, నిస్సహాయులను వేధించకుండా ఉండాలని సూచిస్తున్నారు. ‘కూతురిని అత్తారింటికి పంపకూడదు. నూనె, నల్ల మినపప్పు దానం చేయాలి. ఫలితంగా శని ప్రభావం తగ్గి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి’ అంటున్నారు.

News December 27, 2025

చలికాలంలో పెరుగుతో జలుబు చేస్తుందా?

image

చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందనేది అపోహ అని వైద్యులు చెబుతున్నారు. ‘పెరుగుతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో మందగించే జీర్ణక్రియకు చెక్ పెట్టి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే అందులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని అంటున్నారు. అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన పెరుగును వెంటనే తినొద్దని సూచిస్తున్నారు.