News September 4, 2025
కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.30కి లింగంపేట(M) మోతె గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. 1:10PMకు కామారెడ్డి టౌన్‌లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. 2:20PMకు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.
Similar News
News September 4, 2025
పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు అలర్ట్

పోటీ పరీక్షల్లో దివ్యాంగులే సొంత స్క్రైబ్(సహాయకులు)ను తెచ్చుకునే విధానానికి కేంద్రం ముగింపు పలకనుంది. అవకతవకలు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, SSC, UPSC వంటి సంస్థలు సొంతంగా తయారుచేసుకున్న స్క్రైబ్‌లనే కేటాయించాలని ఆదేశించింది. అభ్యర్థి కన్నా స్క్రైబ్ వయసు 2, 3 విద్యా సంవత్సరాలు తక్కువుండాలి. ఇద్దరూ ఒకే పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండకూడదని తెలిపింది.
News September 4, 2025
అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదా?

అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జండీ తెలిపారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం 2.7% ఉంటే అది వచ్చే ఏడాదికి 3%-4%కి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. టారిఫ్స్ పెంచడంతో అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని వివరించారు. కాగా 2008 మాంద్యాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్త ఈయనే.
News September 4, 2025
దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక: పవన్

AP: GST సంస్కరణలను Dy.CM పవన్ స్వాగతించారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇచ్చిన మాటను PM మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి, రైతులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై GST తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.