News December 19, 2024

రేపు కృష్ణా జిల్లాలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గంగూరు, ఈడ్పుగల్లులో రైతు, రెవెన్యూ సదస్సుల్లో పాల్గొననున్నారు. తొలుత గంగూరులో రైతు సేవా కేంద్రం సందర్శన, రైతు సదస్సు, రైతుల నుంచి ధాన్యం సేకరణను పరిశీలించనున్నారు. ఈడ్పుగల్లు బీసీ కాలనీలో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు.

Similar News

News December 9, 2025

సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే: CM

image

AP: ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేష‌న్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బ‌స్టాండ్లు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్ర‌తను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.

News December 8, 2025

GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

image

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్ PHOTO GALLERY

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు ముగిసింది. ఇవాళ రూ.1.88లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ అన్నీ తానై పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన చూడవచ్చు.