News December 25, 2024
పల్నాడు జిల్లాలో 1న సీఎం పర్యటన

AP: CM చంద్రబాబు నూతన సంవత్సరంలో తొలి రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నరసరావుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తొలుత గురజాలలో పర్యటించాలని అనుకున్నా.. BC ఎమ్మెల్యే ఉన్నచోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో నరసరావుపేటకు మార్చినట్లు తెలుస్తోంది. రొంపిచర్ల మండలం అన్నవరంలో CBN పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
Similar News
News November 2, 2025
రేపటి నుంచి కాలేజీల బంద్!

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపట్నుంచి బంద్‌కు దిగుతామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది. దసరాకు ముందే రూ.1,200CR విడుదల చేస్తామని చెప్పి రూ.300CR రిలీజ్ చేశారని తెలిపాయి. ఫీజు బకాయిలు చెల్లించేవరకు కాలేజీలు తెరవబోమని, ఈ నెల 6న లక్షన్నర మందితో HYDలో సభ నిర్వహిస్తామని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఇవాళ ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.
News November 2, 2025
AVNLలో 98 పోస్టులు…అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL) హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 98 కాంట్రాక్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 2, 2025
T20Iలకు కేన్ మామ గుడ్ బై

NZ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్సన్ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2011లో T20ల్లో డెబ్యూ చేసిన ఆయన 93 మ్యాచుల్లో 2,575 రన్స్ చేశారు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 95. కివీస్ తరఫున 75 మ్యాచులకు కెప్టెన్సీ చేశారు. షార్టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు తనతో పాటు జట్టుకూ ఇదే సరైన సమయమని కేన్ తెలిపారు. దీంతో రానున్న T20WC ప్రిపరేషన్‌కు జట్టుకు క్లారిటీ వస్తుందన్నారు.


