News March 15, 2025

నేడు తణుకులో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్‌’లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉ.7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 8.05కు తణుకు చేరుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ శ్రేణులు, అధికారులతో సమావేశమై 12.55 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 15, 2025

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: BRS ఎమ్మెల్యేలు

image

TG: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు.

News March 15, 2025

‘కోర్టు’ సినిమాలోని ఈ అమ్మాయి ఎవరు?

image

నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘కోర్టు’ మూవీలో ‘జాబిలి’ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ‘శ్రీదేవి అపళ్ల’. స్వస్థలం కాకినాడ. ఆమెను ఓ ఇన్‌స్టా రీల్‌లో చూసిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఫ్రెండ్ యువరాజ్ ఆమెను ఆడిషన్‌కు రిఫర్ చేశారు. అలా కోర్టు మూవీలో ఛాన్స్ వచ్చినట్లు శ్రీదేవి తెలిపారు.

News March 15, 2025

టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

image

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.

error: Content is protected !!