News November 7, 2024
రేపు యాదాద్రి జిల్లాల్లో సీఎం పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన ఖరారైంది. రేపు కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉ.11 గంటలకు YTDA అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం వలిగొండ(మ) సంగెం భీమలింగంకత్వాలో రైతులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను పరిశీలించి, స్థానిక రైతులతో సమావేశం కానున్నారు.
Similar News
News December 4, 2025
HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.
News December 4, 2025
CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


