News April 15, 2025

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్!

image

TG: మంత్రి పదవి విషయంలో పలువురు నేతలు బహిరంగంగా మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదవుల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే లాభం కంటే మీకే నష్టం ఎక్కువని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క MLA కూడా సోషల్ మీడియా వాడట్లేదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

Similar News

News April 17, 2025

సేఫెస్ట్ SUV కార్లు ఇవే..

image

కార్లు ఎంత సేఫ్ అనే విషయాన్ని NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను బట్టి తెలుసుకుంటాం. INDలో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి SUV కారు టాటా నెక్సాన్. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఇది 32 పాయింట్లకు 29.41 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఈవీ(31.46/32), మహీంద్రా XUV 400(30.38/32), కియా సిరోస్(30.21/32), స్కోడా కైలాక్(30.88/32) ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. మీకు నచ్చిన కారేంటి?

News April 17, 2025

ఇది కదా అసలైన ఐపీఎల్ మజా..!

image

IPL ఆరంభం చప్పగా సాగినా ఇప్పుడు మజా ఇస్తోంది. ఒకదానికి మించి మరొకటి అభిమానులకు థ్రిల్ పంచుతున్నాయి. పంజాబ్‌పై SRH 246 రన్స్ ఛేజింగ్, లక్నోపై ధోనీ ఫినిషింగ్, పంజాబ్ కింగ్స్ టోర్నీ చరిత్రలోనే లోయెస్ట్ టోటల్‌(111)ను డిఫెండ్ చేసుకోవడం, రాజస్థాన్‌-ఢిల్లీ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ జరగడంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫీలయ్యారు. ఇంకా మున్ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు చూడాలో అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

News April 17, 2025

వేసవి సెలవుల్లో పార్ట్‌టైమ్ జాబ్ చేయాలా?

image

వేసవి సెలవులు విద్యార్థులకు స్కిల్స్ పెంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం. ప్రస్తుతం టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పలు ఆదాయ మార్గాలు ఉన్నాయి. కాల్‌సెంటర్లు/బీపీఓలు, ట్యూటరింగ్/హోమ్ ట్యూషన్లు, రిటైల్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, క్యాషియర్, డెలివరీ బాయ్, షోరూమ్స్ వంటి వాటిల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీరిని పార్ట్‌టైమ్‌ జాబ్‌లో చేర్చుకోవడానికి కంపెనీలు కూడా సిద్ధంగా ఉంటాయి.

error: Content is protected !!