News July 13, 2024

ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం సతీమణి

image

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు సతీమణి కమ్‌లేశ్ ఠాకూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. కాంగ్రెస్ తరఫున డెహ్రా నుంచి పోటీ చేసిన కమ్‌లేశ్ బీజేపీ అభ్యర్థి హోశ్యార్ సింగ్‌పై 9వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. గత 20 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

Similar News

News December 4, 2025

కంట్రోల్ రూమ్‌లను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్&మానిటరింగ్ కమిటీ, సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే, ఎన్నికలకు సంబంధించిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్‌లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.