News February 15, 2026
CNF అంటే ఏంటో తెలుసా?

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It
Similar News
News February 15, 2026
స్పీకర్ తర్వాత ‘ఎన్నికల కమిషనర్’.. అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు

CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండీ కూటమి సిద్ధమైనట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విపక్షాలు ఇప్పుడు ఏకకాలంలో ఇద్దరు రాజ్యాంగబద్ధమైన అధికారులను టార్గెట్ చేయడం పార్లమెంటరీ చరిత్రలో అరుదైన పరిణామం. మార్చి రెండో వారంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ నోటీసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BJPకి అనుకూలంగా CEC వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ.
News February 15, 2026
శివుడి చేతిలో ఢమరుకం ఎందుకు ఉంటుంది?

ఢమరుకనాదం విశ్వ సృష్టికి మూలం. ఇది ఓంకారనాదానికి ప్రతీక. దీన్నుంచే శబ్దశాస్త్రం, వ్యాకరణం ఉద్భవించాయని పురాణాలు వాక్కు. ఢమరుకంలోని 2 భాగాలు పురుష, ప్రకృతి శక్తుల కలయికను సూచిస్తాయి. ఇవి విశ్వాసం, చైతన్యానికి సంకేతం. మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని ఈ ధ్వని మేల్కొల్పుతుంది. లయబద్ధమైన ఈ శబ్దం సృష్టి, స్థితి, లయల నిరంతర ప్రక్రియను ప్రతిబింబిస్తూ మనలో భక్తి, సానుకూల భావాన్ని నింపుతుంది.
News February 15, 2026
పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.


