News July 17, 2024
4 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి: భట్టి

TG: సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. 4 నెలల్లో గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వెలుపల తొలిసారి చేపడుతున్న ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలన్నారు.
Similar News
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.
News November 19, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

సినీ నటి తులసి యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.
News November 19, 2025
వరి పంటకు అజొల్లా చేసే మేలు

అజొల్లా జీవన ఎరువు వరిపొలంలో నీటిపై తేలుతూ నత్రజనిని స్థిరీకరించి, వరిపైరుకు నత్రజనిని అందుబాటులోకి తీసుకొస్తుంది. వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 2KGల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగిస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని, ఇతర పోషకాలను మొక్కలకు అందించి పంటకు మేలు చేస్తుంది. అజోల్లాను పచ్చిరొట్ట ఎరువుగానూ ఉపయోగించవచ్చు.


