News June 3, 2024
కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు: CBN

AP: కౌంటింగ్ కేంద్రాల్లో కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ‘లెక్కింపులో అనుమానం వస్తే వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు. పోలైన, లెక్కింపులో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి. ఓటమిని తట్టుకోలేక వైసీపీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది. కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు’ అని టెలికాన్ఫరెన్స్లో చెప్పారు.
Similar News
News December 14, 2025
వార్డ్రోబ్ ఇలా సర్దేయండి

చాలామంది వార్డ్రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్రోబ్ నీట్గా కనిపిస్తుంది.
News December 14, 2025
ఈమె ఎంతో మందికి స్ఫూర్తి

TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి ఓటర్లలో చైతన్యం నింపారు. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా ఎంతోమంది ఓటేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రామాయంపేట పరిధి కల్వకుంటలో అంగవైకల్యమున్నా ఆమె పోలింగ్ బూత్కు వచ్చి ఓటేశారు. తండ్రి ఆమెను భుజాలపై మోసుకుని తీసుకెళ్లి ఓటు వేయించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
News December 14, 2025
54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బీటెక్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2025 స్కోరు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,100-రూ.1,77,500 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్సైట్: https://www.dvc.gov.in


