News September 20, 2024

100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం: వైసీపీ

image

AP: కూటమి ప్రభుత్వం గత 100 రోజుల్లో ప్రజలకు చేసింది ‘సున్నా’ అని వైసీపీ విమర్శించింది. ‘సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. దాడులు, దౌర్జన్యాలతో కక్షసాధింపులకే పరిమితం అయింది. ఈ 100 రోజుల్లో 50 మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రావణకాష్ఠంగా మారింది. మంచి ప్రభుత్వమంటూ ప్రచారం తప్ప ఈ 100 రోజుల్లో ప్రజలకు ఒరిగిందేమిటి?’ అని ట్వీట్ చేసింది.

Similar News

News September 20, 2024

రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌ట‌న‌

image

త‌మిళ‌గ వెట్రి క‌ళగం మొద‌టి రాష్ట్ర స్థాయి స‌ద‌స్సును అక్టోబ‌ర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్న‌ట్టు ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌టించారు. త‌మిళ‌ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతోందన్నారు. పార్టీ రాజకీయ భావజాల నేత‌ల‌ను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను స‌ద‌స్సులో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు విజ‌య్ తెలిపారు.

News September 20, 2024

వర్క్ లైఫ్ బ్యాలెన్స్.. యూరప్‌లో బెస్ట్

image

సౌత్ఏషియాతో పోలిస్తే యూరప్ దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగ్గా ఉంది. ఇక్కడ వారానికి సగటున 35Hrs మాత్రమే పనిచేస్తున్నారని ILO తెలిపింది. నెదర్లాండ్స్‌లో 31.6, నార్వేలో 33.7, జర్మనీలో 34.2, జపాన్‌లో 36.6, సింగపూర్ 42.6 గంటలు పనిచేస్తున్నారు. ఇక వనాటులో ఉద్యోగులు సగటున 24.7 గంటలే పనిచేస్తుండటం గమనార్హం. కిరిబాటి 27.3, మైక్రోనేషియా 30.4 గంటలతో తక్కువ పనివేళల జాబితాలో ముందున్నాయి.

News September 20, 2024

నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు 20 పాయింట్లే ఉంది: టీటీడీ ఈఓ

image

AP: నెయ్యి నాణ్యత ఉంటేనే, లడ్డూ నాణ్యతగా ఉంటుందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లకుగానూ 20 పాయింట్లే ఉందని ఆయన తెలిపారు. ‘గతంలో ఏఆర్ డెయిరీ వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్‌లలో పరీక్షించాం. వారంలో రిపోర్టు వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది’ అని ఆయన పేర్కొన్నారు.