News March 24, 2025
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి: రజినీకాంత్

సముద్ర తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూపర్ స్టార్ రజినీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు ఈ మార్గం గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశముందన్నారు. దీనిపై అవగాహాన కల్పించేందుకు 100 మంది CISF జవాన్లు సైకిల్ యాత్ర చేపడుతున్నారని, వారికి సహాకరించాలని కోరారు. 26/11 దాడిలో ఉగ్రవాదులు సముద్రం గుండా వచ్చి దాడి చేసిన ఘటనను గుర్తు చేశారు.
Similar News
News December 5, 2025
NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 5, 2025
మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్‌సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్‌కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్‌ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.


