News September 30, 2024

ఈ ఊరిలో కుటుంబంలో ఒకరిగా నాగుపాములు!

image

మహారాష్ట్రలోని షోలాపూర్(D) షెట్పాల్ గ్రామంలో నాగుపాములు కుటుంబసభ్యుల్లా ఇంట్లోనే తిరుగుతుంటాయి. గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటుండగా పిల్లలు వాటితో ఆడుకుంటారు. సర్పాలను శివుడి ప్రతిరూపాల్లా భావిస్తూ ఇంట్లో అవి ఉండే ప్రాంతాన్ని దేవాలయంగా పరిగణిస్తుంటారు. ఇప్పటివరకు ఈ విషసర్పాలు కాటేసిన ఘటనలు గ్రామంలో వినిపించలేదు. పాము-మనుషుల మధ్య ఉన్న బంధాన్ని చూసేందుకు పర్యాటకులు ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.

Similar News

News September 30, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన TGSRTC

image

TG: దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో MGBS, JBS, LB నగర్, ఉప్పల్, ఆరాంఘర్, KPHB నుంచి సర్వీసులు ఉంటాయంది. విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయాభావం తగ్గించేలా గచ్చిబౌలి ORR మీదుగా బస్సులు తిప్పుతామంది.

News September 30, 2024

స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు: APSRTC

image

AP: దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. అక్టోబర్ 4-20 వరకు 6100 బస్సులు నడుపుతామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర నగరాలకు బస్సులు తిప్పుతామంది. అక్టోబర్ 4-11 వరకు 3040 బస్సులు, అక్టోబర్ 12-20 వరకు 3060 బస్సులు తిరుగుతాయని చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

News September 30, 2024

‘కాంతార’ ప్రీక్వెల్‌లో మోహన్ లాల్?

image

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన ‘కాంతార’కు రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారలో హీరో తండ్రి పాత్రలో కూడా రిషబ్ కనిపించారు. ప్రీక్వెల్‌లో ఆయన కథ ఉంటుందని సమాచారం. ఆ పాత్రకు తండ్రి రోల్‌లో మోహన్‌లాల్ కనిపిస్తారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రీక్వెల్‌పై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.