News September 2, 2025

కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు <<17589092>>ఈ కొక్కెర వ్యాధి<<>> రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.

Similar News

News September 22, 2025

TODAY HEADLINES

image

* రేపటి నుంచి GST ఉత్సవ్: ప్రధాని మోదీ
* 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్
* రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి
* నేను సినిమా ప్రేమికుడిని: పవన్
* కనీసం ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీకి పంపు జగన్: హోంమంత్రి అనిత
* ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్
* కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్‌హౌస్ సెక్రటరీ
* 25న AP డీఎస్సీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ

News September 22, 2025

‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

image

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.

News September 22, 2025

నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

image

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు రాధిక తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. రేపు (సెప్టెంబర్ 22) చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.