News March 30, 2025

ఆహారంలో బొద్దింక, ఎలుక.. 2 వేల శాఖల్ని మూసేసిన హోటల్

image

జపాన్‌లో అతి పెద్ద రెస్టారెంట్ చెయిన్‌గా పేరున్న సూకియా తమకు చెందిన 2వేల హోటల్ శాఖల్ని తాత్కాలికంగా మూసేసింది. ఆహారంలో ఎలుక, బొద్దింక రావడంతో హోటల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. షేర్ విలువ పతనమైంది. ఈ నేపథ్యంలో సూకియా కస్టమర్స్‌కు క్షమాపణలు చెప్పింది. అన్ని రెస్టారెంట్లను మూసేసి పూర్తిగా పరిశుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా క్లీనింగ్ స్టార్ట్ చేసింది.

Similar News

News April 1, 2025

STOCK MARKETS: కొనసాగుతున్న బ్లడ్ బాత్

image

దేశీయ స్టాక్ మార్కెట్స్‌లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1428 పాయింట్లు కోల్పోయి 75,986 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 372Pts నష్టంతో 23,147 వద్ద కొనసాగుతోంది. IT, రియాల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు పతనమయ్యాయి.

News April 1, 2025

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు

image

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. రేపు క్వశ్చన్ అవర్ పూర్తైన తర్వాత బిల్లు చర్చకు వస్తుందన్నారు. 8 గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించామని, అవసరమైతే సమయం పెంచుతామని తెలిపారు. బిల్లు గురించి వివరిస్తూ దాని ప్రయోజనాలను వెల్లడించారు. మతపరమైన సంస్థల్లో బిల్లు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

News April 1, 2025

కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

కూల్ డ్రింక్స్‌ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్‌ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్‌తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

error: Content is protected !!