News September 1, 2025
చర్మానికి కోకో బటర్..

కోకో బటర్‌ను చాక్లెట్స్, కేక్‌ల తయారీలోనే కాకుండా చర్మాన్ని మెరిపించడానికీ వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కోకో బటర్‌లో రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు చర్మానికి రాయాలి. తర్వాతిరోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చర్మం మెరిసేలా చేస్తుంది.
Similar News
News September 23, 2025
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్: సజ్జనార్

TG: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News September 23, 2025
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News September 23, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.