News December 26, 2025
COEకి శ్రేయస్.. న్యూజిలాండ్ సిరీస్‌కి రెడీనా?

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ ఇవాళ బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(COE)కు వెళ్లారు. OCT 25న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. నాలుగు నుంచి ఆరురోజుల వరకు వైద్యులు అయ్యర్ హెల్త్‌ని అసెస్ చేసి అతని కంబ్యాక్‌ని డిసైడ్ చేస్తారు. ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Similar News
News December 30, 2025
Z: లోన్ తియ్.. ట్రిప్ వెయ్.. రిపీట్!

gen-Zలు గొప్పలకై అప్పులు చేస్తున్నారని హెల్తియన్స్ సర్వే వెల్లడించింది. 2025లో లోన్స్ తీసుకున్న 27% gen-Zల మెయిన్ రీజన్ ట్రిప్స్, కన్సర్ట్స్ వంటి లీజర్ యాక్టివిటీస్. R2: కాస్ట్లీ రెస్టారెంట్ ఫుడ్, బ్రాండెడ్ క్లోత్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. R3: ఫోన్స్, ల్యాపీ, స్మార్ట్ వాచ్ వంటి టెక్ థింగ్స్. ఇంకో ట్రెండ్.. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం. ఇలా టెక్కులు, సోకుల కోసం Zలు లోన్ సైకిల్‌లో తిరుగుతున్నారు.
News December 30, 2025
పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. మోదీ తీవ్ర ఆందోళన

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ చేశారు. శాంతి నెలకొనాలంటే దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు శాంతి యత్నాలను దెబ్బతీస్తాయన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. అయితే పుతిన్ నివాసంపై తాము దాడి చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు.
News December 30, 2025
అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.


