News November 9, 2024

సహజీవనం నాకు ఉపయోగపడింది: విక్రాంత్ మాస్సే

image

పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అర్థం చేసుకోవడం ముఖ్యమని, ఇందుకు సహజీవనం తనకు చాలా ఉపయోగపడిందని హీరో విక్రాంత్ మాస్సే చెప్పారు. అయితే తాను ఈ కాన్సెప్ట్‌ను ప్రచారం చేయట్లేదని, దీని గురించి మాట్లాడటానికీ భయమేస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమ ముఖ్యం. నేను, నా భార్య పెళ్లికి ముందు డేటింగ్‌తో అర్థం చేసుకున్నాం. ఇది అందరికీ పనిచేస్తుందని చెప్పలేను’ అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

మెదక్: రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

image

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూసి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసింది. అనూహ్యంగా హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తెలపడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఉపసంహరించుకుంది.

News November 24, 2025

గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.