News August 22, 2024

TMCలో మమత, మేనల్లుడి మధ్య కోల్డ్ వార్?

image

ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న త‌రువాత CM మ‌మ‌తా బెన‌ర్జీ తీరుపై ఆమె మేన‌ల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెన‌ర్జీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. RG క‌ర్ మెడిక‌ల్ కాలేజీలో అక్రమాలపై మమత చర్యలు తీసుకోలేదని, ఘటన జరిగిన తరువాత ప్రిన్సిప‌ల్‌ను వెంటనే మ‌రో కాలేజీకి బదిలీ చేయడాన్ని అభిషేక్ త‌ప్పుబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. దీని వ‌ల్లే ఆయ‌న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం.

Similar News

News January 24, 2025

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: నారాయణ

image

AP: అమరావతి అభివృద్ధి పనులను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను ఆయన పరిశీలించారు. ‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తే 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం’ అని చెప్పారు.

News January 24, 2025

SHOCKING: అల్ట్రా HDలో ‘గేమ్ ఛేంజర్’ లీక్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా అల్ట్రా HDలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 24, 2025

గోల్డ్ రేట్స్ హైక్

image

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ.75,550గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.