News December 18, 2024
చలి పులి.. ఆ జిల్లాలో స్కూళ్ల టైమింగ్స్ మార్పు

TG: రాష్ట్రంలో చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉ.9.40 నుంచి సా.4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉ.9.15 నుంచి సా.4.15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, టైమింగ్స్ మార్చాలని పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News December 24, 2025
చలికాలంలో పెదవుల సంరక్షణకు

చలికాలం వచ్చిదంటే చాలు. చాలామంది పెదవులపై చర్మం పొరలుగా ఎండి ఊడిపోతుండటంతో పాటు పెదవులు నల్లబడిపోతుంటాయి. దీని వల్ల పెదాలు చూడటానికి మంచిగా కనిపించవు. ఈ సమస్యను దూరం చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ☛ కొబ్బరి, బాదం నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. వీటిని పెదవులకు అప్లై చేస్తే మృదువుగా మారతాయి. ☛ పాలు, పసుపు కలిపి పెదవులపై కాసేపు మసాజ్ చేయాలి. దీంతో నలుపు తగ్గి పెదవులు మృదువుగా కనిపిస్తాయి.
News December 24, 2025
‘PPP’పై ఫైట్.. జగన్ సక్సెస్ అయ్యారా?

AP: PPPలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు <<18655341>>స్పందన<<>> కరవైంది. YCP చీఫ్ జగన్ కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిని జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల వద్ద నిరసనలు, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఇటీవల మరో అడుగు ముందుకేసి అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అది చట్టపరంగా సాధ్యం కాదు. కానీ, జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.
News December 24, 2025
ఇయర్ బడ్స్‌ను క్లీన్ చేస్తున్నారా? లేదంటే..

రోజూ వాడే ఇయర్ బడ్స్ చూడటానికి క్లీన్‌గానే అనిపిస్తాయి. కానీ వాటిలో కిచెన్ సింక్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని సరిగా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు, రాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ వాక్స్ పేరుకుపోయి వినికిడి సమస్యలు రావచ్చు. నెలకు ఒక్కసారైనా సాఫ్ట్ క్లాత్ లేదా టూత్ బ్రష్‌తో బడ్స్‌ను తుడవాలి. నీళ్లతో కడగొద్దు. అవి శుభ్రంగా ఉంటే హెల్త్ సేఫ్‌గా ఉండటంతో పాటు డివైజ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.


