News October 26, 2024
Coldplay-Diljit concert: ఈడీ సోదాలు

సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Coldplay, Diljit కన్సర్ట్స్కు సంబంధించి నకిలీ టికెట్లు, ధరల దోపిడీ వ్యవహారంలో ED దర్యాప్తు ముమ్మరం చేసింది. BookMyShow, పలువురిపై నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై, జైపూర్, చండీగఢ్, బెంగళూరులో సోదాలు నిర్వహించింది. సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మార్కెట్‌కు తెరలేపి అనధికార, నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వారిని గుర్తించినట్టు ED అధికారి తెలిపారు.
Similar News
News November 2, 2025
మహేశ్‌ని అలా ఎప్పుడూ అడగలేదు: సుధీర్ బాబు

తన సినిమాల్లో హిట్లున్నా, ఫ్లాపులున్నా పూర్తి బాధ్యత తనదేనని హీరో సుధీర్ బాబు ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘కృష్ణకు అల్లుడు, మహేశ్‌కు బావలా ఉండటం గర్వకారణం, ఓ బాధ్యత. కృష్ణానగర్‌లో కష్టాలు నాకు తెలియదు. కానీ, ఫిల్మ్‌నగర్ కష్టాలు నాకు తెలుసు. నాకో పాత్రగానీ, సినిమాగానీ రికమెండ్ చేయమని నేను మహేశ్‌ను ఎప్పుడూ అడగలేదు’ అని తెలిపారు. జటాధర మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 2, 2025
ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.
News November 2, 2025
నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


