News May 22, 2024

కోల్‌‘కథ’ మార్చేశాడుగా!

image

గత రెండేళ్లలో చెత్త ప్రదర్శనతో నిరాశపర్చిన కోల్‌కతా.. గౌతీ రాకతో ఈసారి ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. బౌలర్ నరైన్‌ను ఓపెనర్‌గా దించి గంభీర్ సక్సెస్ అయ్యారు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది. విలువైన సూచనలతో లీగ్ దశలో జట్టును టేబుల్ టాపర్‌గా నిలపడంలో ఆయనదే కీలకపాత్ర. సారథిగా 2012, 14లో KKRకు కప్పు అందించిన గౌతీ.. ఈ సారి మెంటర్‌గా మరో కప్పు సాధించేందుకు అడుగు దూరంలో నిలిచారు.

Similar News

News January 12, 2025

శుభ ముహూర్తం (12-01-2025)

image

✒ తిథి: శుక్ల త్రయోదశి ఉ.6.12 వరకు
✒ నక్షత్రం: మృగశిర ఉ.11.33 వరకు
✒ శుభ సమయం: ఉ.10.20 నుంచి 10.54 వరకు
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: రా.7.41-9.14 వరకు
✒ అమృత ఘడియలు: రా.1.14-2.46 వరకు

News January 12, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* ‘గ్రీన్ ఎనర్జీ’లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు
* మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్
* రూ.10 లక్షలతో బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్
* కొండపోచమ్మ డ్యామ్‌లో మునిగి ఐదుగురి మృతి
* ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల ఉపసంహరణ
* నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
* అరనిమిషంలో 10కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయగలను: మోదీ
* ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

News January 12, 2025

యువకుల మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి

image

TG: కొండ పోచమ్మ సాగర్ డ్యాంలో <<15126886>>ఐదుగురు యువకులు మరణించిన<<>> ఘటనపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా మరణించిన వారు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.