News October 9, 2025
చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

శరీరాన్ని ఆరోగ్యంగా, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్లనొప్పులు, ముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. జీర్ణవ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. దీనికోసం డైట్‌లో చేపలు, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, దాల్చినచెక్క, గ్రీన్‌టీ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#SkinCare<<>>
Similar News
News October 9, 2025
ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష!

కులవివక్ష రాజకీయాల్లోనే కాదు అధికారులనూ పట్టిపీడిస్తోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సీనియర్ అధికారులు వేధిస్తున్నారని తెలుగువాడైన హరియాణా ADGP పూరన్ కుమార్ 8 పేజీల లేఖ రాసి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు శాఖలో కులవివక్షతో పాటు అక్రమాలపై గళమెత్తడంతో ఉన్నతాధికారులు తనను నాశనం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. లంచం కేసులోనూ ఇరికించారని తుపాకీతో కాల్చుకున్నారు. ఆయన భార్య అమనీత్ IAS.
News October 9, 2025
20 మంది పిల్లలు మృతి.. సర్కార్ నిర్లక్ష్యమే కారణమా?

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19నే మరణాలు నమోదైనా సర్కార్ నిర్లక్ష్యం వహించింది. 29న సిరప్ శాంపిళ్లను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఛింద్వాడా నుంచి భోపాల్ (300 కి.మీ)కు పంపారు. గంటల్లో వెళ్లాల్సిన శాంపిల్స్ 3 రోజులకు అక్కడికి చేరాయి. రిపోర్ట్ రాకముందే అక్టోబర్ 1, 3 తేదీల్లో ఆ సిరప్ సేఫ్ అని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించడం గమనార్హం.
News October 9, 2025
98 ఇంజినీర్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో 98 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి.
* ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.