News May 20, 2024

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు

image

TG: ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం KCR ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. ‘KCR 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు నిర్వహణ లోపంతో అవి కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికైనా అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి ఆ సేవలను పునరుద్ధరించాలి’ అని Xలో డిమాండ్ చేశారు.

Similar News

News December 8, 2025

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

image

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.

News December 8, 2025

‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

News December 8, 2025

ఇంటి పేరు వద్దనుకున్న సమంత?

image

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ‘సమంత రూత్ ప్రభు’ అని ఉంది. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఆమె తన పేరు పక్కన ఎవరి ఇంటి పేరును పెట్టుకునేందుకు ఇష్టపడట్లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంటి పేరును కూడా తొలగించి కేవలం ‘సమంత’ అనే బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. కాగా అంతకుముందు సమంత అక్కినేని అని ఉండేది.