News May 20, 2024
రేవ్ పార్టీ నిందితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరణ

బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 71 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. మహిళల్లో నటి హేమతో పాటు పలువురు మోడల్స్, టెకీలు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారందరినీ పీఎస్‌కు తరలించిన పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించగా.. మిగతావారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయనున్నారు.
Similar News
News December 31, 2025
క్రికెట్.. 2025లో టాప్-5 ‘ఫస్ట్’ ఈవెంట్స్

☛ భారత మహిళల జట్టు ‘ఫస్ట్’ టైమ్ ODI WC గెలిచింది
☛ మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ‘ఫస్ట్’ టీమ్‌గా IND మెన్స్ టీమ్ రికార్డు
☛ RCB ‘ఫస్ట్’ టైమ్ IPL టైటిల్ గెలిచింది
☛ టెస్ట్ క్రికెట్లో ‘ఫస్ట్’ టైమ్ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు (వెస్టిండీస్) డకౌట్ అయ్యారు. ఇందులో స్టార్క్(AUS) 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీశారు.
☛ సౌతాఫ్రికాకు ఫస్ట్ ‘WTC’ టైటిల్ విజయం
News December 31, 2025
Ohh.. అప్పుడే క్వార్టర్ అయిపోయింది!

ఇది ఈ శతాబ్దంలో నేటితో ముగుస్తున్న క్వార్టర్ టైమ్ గురించి. 2001తో మొదలైన 21వ శతాబ్దంలో ఇవాళ్టితో పావు వంతు పూర్తయింది. మిలీనియం మొదట్లో చదువుకుంటున్న లేదా అప్పుడే నడక మొదలుపెట్టిన మనలో చాలామంది ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే.. ఈ ఇయర్ మాత్రమే కాదు 25 ఏళ్లు ఎంత ఫాస్ట్‌గా అయిపోయాయి అనిపిస్తుంది. ఇన్నేళ్ల జ్ఞాపకాలతో మరో కొత్త ఇయర్లోకి కొత్త ఆశలు, ఆశయాలతో అడుగుపెడదాం. Happy New Year.
News December 31, 2025
డియర్ కపుల్స్.. మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయండి!

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అయితే దంపతులు కచ్చితంగా ఈ ఒక్క పని చేయాలి. ఈ ఇయర్లో జరిగిన గొడవలు, చేదు అనుభవాలు, నచ్చని విషయాలు, ఇద్దరినీ ఇబ్బంది పెట్టిన క్షణాలను ఈ ఏడాదికే పరిమితం చేయండి. వాటిని కొత్త సంవత్సరానికి మోసుకెళ్లి మీ మధ్య దూరాన్ని మరింత పెంచుకోకండి. సమస్యలుంటే ఇవాళే కూర్చుని మాట్లాడుకోండి. డియర్ కపుల్స్.. కొత్త సంవత్సరాన్ని కొత్తగానే స్టార్ట్ చేయండి. Happy New Year.


