News September 28, 2024
ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల సేకరణ

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వర్గీకరణపై వివిధ సంఘాలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అభిప్రాయాలు ఇవ్వాలని తెలిపింది.
Similar News
News December 12, 2025
INDvsSA.. 5 పరుగులు, 5 వికెట్లు

SAతో రెండో టీ20లో IND 162 పరుగులకు ఆలౌటై 51 రన్స్ తేడాతో <<18539012>>ఓడింది<<>>. చివరి 5 వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 8 బంతుల్లో 5 వికెట్లు పడ్డాయి. 157 రన్స్ వద్ద 6, 158 వద్ద 7, 162 వద్ద 8, 9, పదో వికెట్ పడింది. అభిషేక్(17), గిల్(0), SKY(5), తొలి టీ20లో అదరగొట్టిన హార్దిక్ (23 బంతుల్లో 20) స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం, స్పిన్నర్లను బాగా ఆడే దూబేను 8వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం INDను దెబ్బతీసింది.
News December 12, 2025
ప్రెగ్నెన్సీకి ముందు ఏ టెస్టులు చేయించుకోవాలంటే..

ప్రతి మహిళ ప్రెగ్నెంట్ అయ్యే ముందు కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు. వాటిల్లో ముఖ్యమైనవి రూబెల్లా, చికెన్ పాక్స్, HIV, హెర్సస్, హెపటైటిస్ B, థైరాయిడ్, జన్యు పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. వీటితో పాటు గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా టీకాలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మెంటల్ హెల్త్ చెకప్ కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News December 12, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


