News September 24, 2025
12 రోజుల్లో ₹140 కోట్లకు పైగా కలెక్షన్స్

తేజా సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నార్త్ అమెరికా కలెక్షన్స్ $3M (రూ.26కోట్లు)కి చేరువలో ఉన్నట్లు తెలిపింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
Similar News
News September 24, 2025
FMG విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్లు: సత్యకుమార్

AP: విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన వారికి ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ’APMCకి 2023-24లో 653 దరఖాస్తులు రాగా 318 పరిష్కారమయ్యాయి. మిగతా వారి సమస్యపై కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశాం. ఆన్లైన్ తరగతులను కోల్పోయిన విద్యార్థులు అంతే కాల వ్యవధితో ఆన్లైన్లో చదివితేనే కోర్సు పూర్తయినట్లు గుర్తిస్తామని NMC పేర్కొంది’ అని మంత్రి వివరించారు.
News September 24, 2025
అభిషేక్ శర్మ అర్ధ శతకం

ఆసియా కప్: బంగ్లాదేశ్ బౌలర్లపై అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. కేవలం 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశారు. గిల్(29) కూడా అద్భుత ఫామ్‌లో కనిపించినా బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. 8 ఓవర్లకు భారత్ స్కోర్ 83/1. అభిషేక్ శర్మ(50*), దూబే(2*) క్రీజులో ఉన్నారు.
News September 24, 2025
రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన

AP: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. SKL, VZM, మన్యం, అల్లూరి తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.