News April 25, 2025
కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.
Similar News
News April 25, 2025
IPL: RR ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!

రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. 9 మ్యాచ్‌లలో 7 ఓటములతో ఆ జట్టుకు రన్ రేటు -0.625 ఉంది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే మిగతా 5 మ్యాచ్‌లను అతి భారీ తేడాలతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టు 14 పాయింట్లను దాటకూడదు. అలాగే ఇతర జట్ల కంటే బెటర్ నెట్‌రన్ రేటు ఉండాలి. GT, DC, RCB, MI, PBKS అదరగొడుతున్నందున ఏదైనా అద్భుతం జరిగితే తప్ప RR ప్లేఆఫ్స్ వెళ్లలేదు.
News April 25, 2025
ఈ వారంలోనే TG టెన్త్ ఫలితాలు!

TG: టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ ఆమోదం లభించగానే ఫలితాలను రిలీజ్ చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
News April 25, 2025
ఆమె చదువు అమూల్యం.. అతని సాయం చిరస్మరణీయం

AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్‌లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్‌బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.