News June 24, 2024
RTC బస్సులో ప్రయాణించిన కలెక్టర్

ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో మెదక్ నుంచి నర్సాపూర్ వరకు ప్రయాణించి అధికారులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఓ కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Similar News
News October 19, 2025
‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.
News October 19, 2025
తొలి వన్డే.. వర్షంతో మ్యాచ్కు అంతరాయం

పెర్త్లో జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. 9వ ఓవర్ నడుస్తుండగా వర్షం పడటంతో మ్యాచ్ ఆపేశారు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(2), అక్షర్ పటేల్(0) ఉన్నారు. రోహిత్, కోహ్లీల తర్వాత గిల్(10) కూడా ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 25/3గా ఉంది.
News October 19, 2025
ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్లోని ఆలమనగర్లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.