News March 19, 2025
ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, పీ4 విధానంపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, అర్హులకు పథకాల అందజేత, ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News March 19, 2025
శ్రీవారి వివిధ సేవల టికెట్ల విడుదల తేదీలివే..

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఈ నెల 21న ఉ.10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మ.3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటా టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే, మార్చి 22న ఉ.10 గంటలకు జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్లు, అదే రోజు ఉ.11 గంటలకు మే నెల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను TTD విడుదల చేయనుంది.
News March 19, 2025
పేద, మధ్య తరగతి ప్రజలే హైడ్రా లక్ష్యమా?: హైకోర్టు

TG: హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలే దాని లక్ష్యమా? అని ప్రశ్నించింది. పెద్దల అక్రమ భవనాలనూ కూల్చినప్పుడే భూములను రక్షించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అని నిలదీసింది. దుర్గంచెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించలేదని దుయ్యబట్టింది. మీరాలం చెరువు పరిసరాల్లో ఆక్రమణలుంటే చర్యలు తీసుకోవాలంది.
News March 19, 2025
త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దీంతో ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో బంధువులు సంబరాలు చేసుకున్నారు. 9 నెలల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి తిరిగిరావడం సంతోషంగా ఉందని ఆమె సోదరి ఫాల్గుణి పాండ్య తెలిపారు. తామంతా ఓ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు సునీత ఇండియాకు వస్తారని పేర్కొన్నారు.