News March 25, 2025
నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News November 19, 2025
తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్గఢ్లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్ఛార్జ్గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.
News November 19, 2025
అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 19, 2025
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్ ఇష్యూస్ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్&డైలాగ్ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.


